RCB మేనేజ్మెంట్ ని వణికించిన హార్దిక్ పాండ్యా!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదటగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 222 పరుగులు చేయగా అనంతరం చేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 209 పరుగులు చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ దశలో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించారు. ముంబై టీం ఓడిపోతుంది అని అందరూ అనుకోగా బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతుల్లోనే ఏకంగా 6, 4,6 విధ్వంసం సృష్టించాడు. కేవలం 8 బంతుల్లోనే 33 పరుగులు కొట్టి ఒకానొక దశలో ఫాస్ట్ స్టాప్ సెంచరీ చేసేలా కనిపించారు. చివరికి 15 బంతుల్లో 42 పరుగులకు హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యారు. అప్పటికి 11 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా... ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమికి గురి అయింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 పురుగులతో విజయం సాధించింది.
Comment List