సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలేంటి..?
* తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాల సంఖ్య ఎంత..?
* లోక్ సభలో కోరిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
లోకల్ గైడ్:
ఖమ్మం: సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలు తెలపాలని, దేశవ్యాప్తంగా ప్రాంతీయ శిక్షణా కేంద్రాల సంఖ్యను పెంచాలని యోచిస్తే.. ఆ వివరాలేమిటో చెప్పాల్సిందిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
కేంద్రమంత్రి అమిత్ షా తెలిపిన వివరాలు ఇలా..
* నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక చట్టబద్ధమైన కార్పొరేషన్.
* కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక పథకమే ఈ..సహకార ప్రగ్యా.
* సహకార సంఘాలు, సభ్యులను శక్తివంతం చేయడానికి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించడం ప్రధాన లక్ష్యం.
* అందులో భాగంగానే..సహకార సంస్థలను ఆధునీకరిస్తూ.. డిజిటలైజ్ చేస్తూ.. గ్రామీణాభివృద్ధిని కాంక్షిస్తున్నాం.
* శిక్షణ, పరిశోధన మరియు కన్సల్టెన్సీ వింగ్‌గా పనిచేస్తున్న లక్ష్మణరావు ఇనామ్‌దార్ నేషనల్ అకాడమీ ఫర్ కోఆపరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఎల్ఐఎన్ఏసీ) ద్వారా సహకార ప్రగ్యాను అమలు చేస్తున్నాం. 2018-19 నుంచి ఈ ఏడాది.. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి..మొత్తం 1,95,567 మందికి లబ్ధి చేకూరింది.
* తెలంగాణ రాష్ట్రంలో పథకాన్ని అమలుచేయడానికి హైదరాబాద్ లో ఒక ప్రాంతీయ శిక్షణా కేంద్రం కలదు.
Comment List