డెబ్యూ మ్యాచ్ లోనే ఇరగదీసిన ముంబై ఇండియన్స్ బౌలర్
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్ చాలా ఉత్కంఠంగా సాగుతుంది. ప్రతిరోజు మ్యాచ్ కూడా చివరి వరకు వచ్చి ఫలితాలను రాబడుతున్నాయి. అయితే ఈ సారీ కొత్త ప్లేయర్లు అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇక తాజాగా నిన్న కేకేఆర్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ముంబాయ్ వేదికగా మ్యాచ్ జరగగా ముంబై ఇండియన్స్ తరఫున డెబ్యూ చేసిన కొత్త బౌలర్ అశ్వినీ కుమార్ ఇరగదీశాడు. ఎడమ చేతి బౌలర్ అయిన అశ్విని కుమార్ తన ఫాస్ట్ బౌలింగ్ తో 3 ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. ఐపీఎల్ డబ్ల్యూ లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా అశ్విని కుమార్ నిలిచాడు. ఇక మొత్తంగా రహనే, రింకు సింగ్, మనీష్ పాండే, రసూల్ లాంటి భీకరమైన ఆటగాళ్లను అవుట్ చేశాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని ముంబై ఇండియన్స్ వెలికి తీసిందని.. త్వరలోనే అతడు భారత్ తరపున కూడా ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కాగా ఈ సంవత్సరం జట్లు మారిన ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా కృనాల్ పాండ్యా, శ్రేసయ్ అయ్యర్, అశుతోష్ శర్మ నిలిచారు.
Comment List