నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
లోకల్ గైడ్ న్యూస్:
రానున్న వేసవి దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. లీకేజీలు ఉన్నందున వచ్చే నీటిలో నీరు వృథా అవుతుందన్నారు. మున్సిపల్ అధికారులు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి ఫిర్యాదులకు తావు లేకుండా జాగ్రత్తపడాలని సూచించారు. అలాగే ప్రతి వార్డు లో రిపేర్ అయిన విధి బల్బుల స్థానంలో విధి బల్బులు సకాలంలో అమర్చలని సూచించారు. మున్సిపాలిటీ లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని కోరారు. నాన్ ట్యాక్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నెల లోపల అసెస్మెంట్ కానీ కంపెనీల ట్యాక్స్ లను మదింపు చేసి పన్ను వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని కోరారు..
Comment List