మోనాలిసాకు షాక్... డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్!..

మోనాలిసాకు షాక్... డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళా ఉత్సవాలలో పూసల దండలు అమ్ముకుంటూ, తన మ్యాజిక్ కళ్ళతో రాత్రికి రాత్రే ఫేమస్ అయినా  మోనాలిసా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈమె రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో  ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అయితే ఆమె అందం మరియు తన మ్యాజిక్ కళ్ళను చూసి డైరెక్టర్ సరోజ్ మిశ్రా తను తీసే సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా లైంగిక వేధింపుల కేసులో డైరెక్టర్ సరోజ్ మిశ్రా ను పోలీసులు అరెస్ట్ చేశారు. తను ను డైరెక్టర్ లైంగికంగా  వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతీ ఫిర్యాదుతో ఆయన పై తాజాగా పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. " ది డైరీ ఆఫ్ మణిపూర్" అనే పేరుతో తరికెక్కించే సినిమాలో మోనాలిసాని  హీరోయిన్గా తీసుకున్నట్లు సనోజ్ మిశ్రా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ అరెస్టు అయిన నేపథ్యంలో మోనాలిసా సినిమా కళ నెరవేరేనా అని సోషల్ మీడియా వేదికగా మోనాలిసా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మోనాలిసా కూడా ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే ఆలోచనలో పడింది. మరి ఈ సినిమానే కాకుండా వేరే సినిమాలో కూడా మోనాలిసాకి అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

 images (7)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News