కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి   

కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి

మిడ్జిల్ :
 
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందాయని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి అన్నారు గురువారం మిడ్జిల్ మండల పరిధిలోని  రాణి పేట్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో  సీసీ రోడ్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి  మాట్లాడుతూ గత పది సంవత్సరాలనుండి తెలంగాణలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిదులనుండే అని ఆయన అన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ గ్రామ పంచాయతీ లకు, మున్సిపాలిటీలకు అనేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించి ఉంటే కేంద్రం నుండి అనేక నిధులు వచ్చేవని అన్నారు.గత పాలకులు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గత పాలకుల మాదిరిగానే వ్యవహరించడం సిగ్గు చేటని ఆయన అన్నారు. సీసీ రోడ్లు, వీధి లైట్లు, త్రాగు నీరు కు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారుఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నిరంజన్, ఉప సర్పంచ్ రామచంద్రయ్య,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, శేఖర్ రెడ్డి ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు, ఆంజనేయులు,నరేష్ చారి,నాయకులు వెంకటయ్య, బూత్ అధ్యక్షులు దర్శన్ చారి, పెద్దా నర్షింహా, పెంటయ్య, శబీర్, బాల బిరయ్య, చందన్న ఆంజనేయులు ,బుచ్చయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి