లక్ష డప్పులు వేల గొంతుల కు వచ్చిన డబ్బులు మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలి: డాక్టర్ పిడమర్తి రవి 

ఎంఆర్పిఎస్ కు పిడమర్తి సవాల్ 

లక్ష డప్పులు వేల గొంతుల కు వచ్చిన డబ్బులు మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలి: డాక్టర్ పిడమర్తి రవి 

లోకల్ గైడ్:ఖమ్మం ప్రతినిధి:

అమరవీరుల పై మందకృష్ణ మాదిగ కు ప్రేమ ఉంటే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమనికి వచ్చిన డబ్బులు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు బాబు జిగ్జిమన్ రావు విగ్రహం నుంచి ఆబిడ్స్ లోనే సురేందర్ మాదిగ విగ్రహం వరకు మాదిగ అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించిన పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వసూలు చేసిన లక్షల కోట్ల డబ్బులు మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలనిఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు దశాబ్దాల వర్గీకరణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలను ఏరోజు మందకృష్ణ మాదిగ పట్టించుకోలేదని కేవలం వ్యక్తిగత అస్తిత్వం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జతకట్టి తన కుటుంబం ఆర్థికంగా సెటిల్ కావడానికి ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని వాడుకున్నారని స్వయంగా దేశ ప్రధాని  నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కూడా అమరవీరుల సంక్షేమం గురించి ఒక్క మాట చెప్పలేదని అన్నారు మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఇప్పుడైనా న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగను డిమాండ్ చేశారు.మాదిగ అమరవీరుల కుటుంబాల ఆశయాలను అమలుపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించడానికి ఈ విజయం మాదిగ అమరవీరులదే అని అన్నారు. పొన్నాల సురేందర్ మాదిగ ఈరోజు పోరాటంతో వర్గీకరణ ఉద్యమంలో అమరుడు అయ్యాడని అతని ఉద్యమ స్ఫూర్తి కి మాదిగలు ఎప్పటికీ రుణపడి ఉంటారని సురేందర్ మాదిగ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఘనమైన నీవులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మీసాల మల్లేశం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండ్రు నారసింహ మాదిగ, టీవీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మర స్టాలిన్, ఎమ్మార్పీఎస్ కేసు బాబు రాష్ట్ర అధ్యక్షులు బోయేని ఎల్లేష్,బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, తెలంగాణ జనాలతో దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రమళ్ళ మొగులయ్య, ఎమ్మార్పీఎస్ మహిళా నాయకురాలు వరలక్ష్మి,మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షులు నక్క మహేష్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జెర్రీపోతుల సాయన్న, మాదిగ చేసి రాష్ట్ర నాయకులు పాతకోటి కరణ్, రింగు రాంబాబు, గుర్రం కోటేష్, సాయిలు,దేవరకొండ నరేష్ , శివ,మీసాల మహేష్, రమేష్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు