పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పంను ఏర్పాటు చేసిన రవీందర్ యాదవ్

ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు

కళాకారులతో కలిసి రవీందర్ యాదవ్ బర్త్ డే వేడుకలు నిర్వహణ

వారికి నూతన వస్త్రాలను అందించిన రవీందర్ యాదవ్

పర్యాటకులను ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్

ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానంతో స్వయంగా పూరీ వెళ్లి సంబరాలు

స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న డ్రోన్ వీడియో

లోకల్ గైడ్ శేరిలింగంపల్లి( తెలంగాణ)పూరీలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లికి చెందిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పూరీ సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. సైకత శిల్పంలో కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని అందులో పేర్కొన్నారు. అచ్చం ఎమ్మెల్సీ కవితలా రూపుదిద్దిన సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవిత బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పలువురు కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు. వారితో కలిసి శుభాకాంక్షలను తెలుపుతూ వీడియోను రూపుదిద్దారు. డ్రోన్ తో సైకత శిల్పాన్ని, కళాకారుల నృత్యాలను చిత్రీకరించారు. బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ చాటుకున్నారు. హైదరాబాద్ లోనూ పలు చోట్ల బర్త్ డే వేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు. రాణిరుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ బతుకమ్మను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు. నాడు ఎంపీగా, నేడు ఎమ్మెల్సీగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం నిరంతరం తపిస్తారన్నారు. ఆపద వస్తే ముందుండే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని రవీందర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగు జాడలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి