ఇది ప్ర‌భాస్ క్రేజ్ అంటే..

రీరిలీజ్‌లోను హాట్ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్స్

ఇది ప్ర‌భాస్ క్రేజ్ అంటే..

లోకల్ గైడ్:

కృష్ణంరాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప్ర‌భాస్ త‌న క్రేజ్‌ని అమాంతం పెంచుకుంటున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని ఫ్లాపులు ప‌ల‌క‌రించిన త‌ర్వాత వ‌ర‌స‌గా హిట్స్ అందుకుంటున్నాడు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమా కృష్ణంరాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప్ర‌భాస్ త‌న క్రేజ్‌ని అమాంతం పెంచుకుంటున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని ఫ్లాపులు ప‌ల‌క‌రించిన త‌ర్వాత వ‌ర‌స‌గా హిట్స్ అందుకుంటున్నాడు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో సూప‌ర్ స‌క్సెస్ అందుకొని త‌న స‌త్తా ఏంటో నిరూపించాడు. ఇక ప్ర‌భాస్ త‌న త‌ర్వాతి సినిమాల లైన‌ప్ చూస్తే దుమ్ము రేప‌డం ఖాయం. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న ప్ర‌భాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు.ఇక ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా భారీ యాక్ష‌న్ డ్రామాగా రూపొంది ప్ర‌భాస్ అభిమానుల‌కి మంచి ఫీస్ట్ అందించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 21న రీరిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. పది అంటే పది నిమిషాల్లో థియేటర్లో నాలుగు షో టికెట్స్ సేల్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో సుదర్శన్ హాలులో స‌లార్ చిత్రం రీరిలీజ్ అవుతుంది. ఈ థియేట‌ర్‌లో సినిమా చూడ‌డం ఒక అనుభూతి మాదిరిగా ఉంటుంది. అందులో ప్ర‌భాస్ సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. అందుకే జ‌నాలు స‌లార్ సినిమా రీరిలీజ్ చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ఈ సినిమా క‌లెక్ష‌న్స్ విష‌యంలో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి