సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి....
అడిగిన వెంటనే నిధులు మంజూరు ఇస్తున్న సీఎం గారికి కృతజ్ఞతలు తెలపాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లోకల్ గైడ్ తెలంగాణ,జనగాం జిల్లా ప్రతినిధి:
లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు తీసుకువస్తానని, జీడికల్ రామచంద్ర స్వామి చెరువుకు గోదావరి జలాలు తీసుకురావడం అదృష్టగా భావిస్తున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని కేబీఆర్ ఫంక్షన్ హల్లో లింగాల ఘనపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండలంలోని ఆయా గ్రామాల నుండి సీఎం సభకు జన సమీకరణ వివరాలను గ్రామాల వారీగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రం శివునిపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేసి సీఎం కు ఘన స్వాగతం పలకాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై ప్రేమతో అడిగిన వెంటనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోలేని విధంగా ఒక్క ఏడాదిలోనే 800కొట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుంటున్నట్లు వెల్లడించారు. కావున సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని ఎక్కువ నిధులు మంజూరు తెచ్చుకోవాలని తెలిపారు.లింగాల ఘనపూర్ మండలంలోని ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపుతానని హామీ ఇచ్చారు. లింగాల ఘనపూర్ మండలానికి నవాబ్ పేట రిజర్వాయర్ ద్వారా, అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా మండలంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని స్పష్టం చేశారు. జీడికల్ సీత రామచంద్ర స్వామి వారి దేవుడి చెరువుకు గోదావరి జలాలు తీసుకురావడం అదృష్టంగా భకవిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగ జీడికల్ -జనగామ రోడ్డును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి సంబందించిన ఇందిరమ్మ ఇళ్లకు స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే సభలో నియోజకవర్గానికి మరిన్ని ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సీఎం ను కోరానున్నట్లు పేర్కొన్నారు. బిఆరఎస్, బీజేపీ పార్టీలు జోదేద్దుల వలే వ్యవహారిస్తున్నారని ఏద్దేవా చేశారు. తెలంగాణ కేంద్ర మంత్రులు ఢిల్లీలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటారని, వీరికి తెల్లారి లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణ కు అదనంగా ఒక్క రూపాయి అయిన తెచ్చారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఒక పెద్ద దద్దమ్మ అని మండిపడ్డారు. బిఆరఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి ఆగం ఆగం అవుతున్నారని తెలిపారు. అందుకే కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఓర్వలేక పిచ్చి ప్రేలాపణలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి పసలేని, పనికిమాలిన విమర్శలను తీవ్రంగా ఖండించాలని సూచించారు. మన పార్టీని, మన ప్రభుత్వాన్ని మనమే కాపాడుకోవాలని అన్నారు. కష్టపడి పని చేసే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారు. అందుకు ఓపిక, సహనం అవసరమని తెలిపారు. సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందుకు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్దులేనని అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని తెలిపారు. ఈ కార్యక్రమలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List