సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్..
లోకల్ గైడ్ న్యూస్ - షాద్ నగర్ :
నందిగామ మండల పరిధిలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ కళాశాలలో ఢిల్లీకి చెందిన షేక్ బిగ్ బాస్ లా మూడో సంవత్సరం విద్యార్థి అనుమానాస్పద స్థితిలో బాత్రూంలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశించి లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థలలో చేర్పిస్తే చివరకు మృతిచెందడం తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురిచేసిందని బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ స్పందిస్తూ, విద్యార్థి మృతికి గల అసలు కారణాలను వెలికితీసేలా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వంటి అనుచిత అలవాట్లే విద్యార్థి మృతికి కారణమై ఉండొచ్చని పలు ఆరోపణలు విన్నవించామని ఈ అంశంపై పోలీసులు పర్యవేక్షణ పెంచాలని ఆకాష్ నాయక్ కోరారు.విద్యార్థి మృతిపై న్యాయం జరిగే వరకు నిరసన చేపట్టేలా సిద్ధంగా ఉన్నామని ఆకాష్ నాయక్ హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలేజీ యాజమాన్యం విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అరుణ్, రాజేష్, రాహుల్, ప్రకాష్, తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు..
Comment List