ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి ...
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ బొడ్డు.
లోకల్ గైడ్ తెలంగాణ,ధర్మసాగర్:
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా గ్రూప్ 1 , 2 , 3, హెచ్.డబ్ల్యు.వో , ఎక్సటెన్షన్ ఆఫీసర్ జాబ్స్ ఫలితాల విడుదల చేస్తామని టీజీపిఎస్సీ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలోనీ మెయిన్ రోడ్డు వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సోంపెల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలోజరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షను ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం నియమించిన గౌరవ జస్టిస్ షమిమ్ అక్తర్ గారి నివేదిక ఆధారంగా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను విడుదల చేస్తూ మాదిగలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తామని అవసరమైతే ఇది వరకు ఇచ్చిన నియామకాల ఫలితాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ప్రత్యేకమైన ఆర్డినెన్సు తీసుకు వచ్చి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 , 2 , 3, హెచ్.డబ్ల్యు.వో ఎక్సటెన్షన్ ఆఫీసర్ జాబ్స్ ఫలితాల విడుదల చెయ్యటం మాదిగలను మోసం చెయ్యటమేనని తెలిపారు. కనుక ఉద్యోగ నియమాకాలు వర్గీకరణ అమలు చేశాకే వర్గీకరణతో కూడిన ప్రభుత్వ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కూడా పునరలోచించుకోవాలని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని తన నిలబెట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పుట్ట ప్రశాంత్ మాదిగ ఎల్కుర్తి మాజీ సర్పంచ్ మాదాసి యాదగిరి ,మాజీ ఎంపీటీసీ ధర్మసాగర్ జాలిగాపు సారయ్య,విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు మాచర్ల బాబు, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి చిలుక రాజు , కొలిపాక సుమన్ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు ,కొట్టే భాస్కర్, పులిపాక శ్రావణ్, నక్క ప్రవీణ్, గంగారపు బిక్షపతి, పోలమారు శౌరి, మాచర్ల బాబు, మారపాక విజయ్ కుమార్, నక్క శ్రీధర్ కె, మనోజ్ మరియు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
Comment List