ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి.

వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యా  నాయక్ 

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి.

 లోకల్ గైడ్ తెలంగాణ వికారాబాద్ :-

 సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు133 పిర్యాదులు  సమర్పించారని,వాటిలో  ధరణి కి సంబంధించిన భూ  సమస్యలు,ఆసరా  పెన్షన్లు ,  ఇరిగేషన్, భూసర్వే ఇతర సమస్యలకు సంబంధించి    దరఖాస్తులు  వచ్చాయని తెలిపారు.మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను  పెండింగ్ ఉంచకుండా  ఎప్పటికప్పుడు  పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ వాసు చంద్ర,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి