నహీద్ జహాన్ సౌత్ జోన్ కుంపు పోటీలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.
తెరాస ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
నహీద్ జహన్ కు 10000/- రూ..ప్రోత్సాహకం అందజేత
నహీద్ జహాన్ తెలంగాణ రాష్ట్రం నుండి సౌత్ జోన్ కు కుంగ్ ఫు పోటీలకు ఎంపిక పట్ల హర్షం.
లోకల్ గైడ్ తెలంగాణ, కొందుర్గు
నహిద్ జహాన్ తెలంగాణ రాష్ట్రం నుండి సౌత్ జోన్ కుంప్ పోటీలకు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో బతకాలంటే ఆత్మ రక్షణకు సంబంధించిన విద్యలలో ఆరితేరి తమను తాము రక్షించుకునే విధంగా బలంగా తయారై మానసికంగా శారీరకంగా అత్యంత దృఢంగా తయారవ్వాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. కొందుర్గు మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కు నవీన్ రెడ్డి కుంగ్ ఫు పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి సౌత్ జోన్ కు ఎంపికైన కొందుర్గు మండల కేంద్రానికి చెందిన నహీద్ జహాన్( న్యూ మాంక్స్ కుంగ్ ఫు) కు ప్రోత్సాహకంగా 10000/- రూపాయలను అందించి సన్మానించారు. నహీ ద్ జహాన్ పోటీలలో మరింత ముందు స్థాయికి వెళ్లాలని, తన సహాయం ఎప్పుడూ ఉంటుందని, అధైర్య పడకుండా అన్ని పోటీలలో విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో కొందుర్గు మండల నాయకులు మాజీ జడ్పీటీసీ రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మెంత్యాలమాజీ సర్పంచ్ నర్సింలు. చంద్ర శేఖర్, కుంగ్ ఫు రమేష్ మాస్టర్, శ్రీకాంత్, సలీమ్, తదితరులు పాల్గొన్నారు.
Comment List