నేటి బాలలే రేపటి పౌరులు 

గెలిచిన , ఓడిన ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతాం

నేటి బాలలే రేపటి పౌరులు 

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  సహకారంతో 

 బూత్ అధ్యక్షులు చాకలి మహేందర్  ఆధ్వర్యంలో నోట్ బుక్ ల పంపిణీ 

 ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కంచుకోట  కుమ్మరి మహేష్ పాల్గొన్నారు 

లోకల్ గైడ్ న్యూస్-కేశంపేట:

మండల పరిధిలో ని పోమాలపల్లి గ్రామంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో భూత్ అధ్యక్షులు *చాకలి మహేందర్  ఆధ్వర్యంలో నోట్ బుక్ ల పంపిణీ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమ్మరి మహేష్  మాట్లాడుతూ ఎన్నికలలో గెలిచిన, ఓడిన ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే మా నాయకుని ఆలోచన గెలిచిన వారికి లేదు. ఇలాంటి నాయకుడు షాద్ నగర్ నియోజకర్గంలో  ఉండటం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. గతంలో గెలిచిన నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న , ఇప్పుడు గెలిచిన నాయకులు సంవత్సరం 15 నెలల నుండి అధికారంలో ఉన్న, ఎవరు కూడా ప్రజల కోసం, యువకుల భవిష్యత్తు  కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఆలోచన చేసినట్టు కనబడ లేదు. అధికారం రాకున్నా, ఎన్నికలలో ఓడిపోయిన కూడా పిల్లల భవిష్యత్తు కోసం పుస్తకాల పంపిణీ చేయడం చాలా సంతోషకరమని వారికి ముందు ముందు ప్రజ ఆశీర్వాదంతో మంచి స్థాయిలో ఉండాలని, ఇలాగే ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉండాలని రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు సభ్యులు మహేష్ అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు