బాంబుల పేలుళ్లతో భయాందోళనలు
లోకల్, గైడ్ మిడ్జిల్ :
రాష్ట్ర ప్రభుత్వం క్వారీలకు అనుమతి ఇచ్చే ముందు స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయని అధికార యంత్రం పర్యవేక్షణ చేపట్టి కంకర పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వనికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం కంటె ప్రజాప్రయోజనాలకె ప్రాధాన్యం ఇవ్వాలనేదే ప్రాథమిక సూత్రం తెలంగాణ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఇవేమి పట్టించుకోకుండా యదేచ్చగా కంకర పరిశ్రమలను నడిపించడానికి అనుమతులు ఇస్తున్నారు మిడ్జిల్ మండలం పరిధిలోని చేతిఘాట్ తండా బైరంపల్లి కంచనపల్లి మూడు గ్రామాల సరిహద్దులలో గుట్టపై కంకర పరిశ్రమను నెలకొల్పారు కంకర పరిశ్రమతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు కంకర పరిశ్రమల నుండి వస్తున్న దుమ్ముతో పంటలు పండడం లేదని బైరంపల్లి గ్రామం మీదుగా ప్రతినిత్యం వందల సంఖ్యలో కంకర టిప్పర్లు నడుస్తున్నాయని గ్రామం భయం గుప్పెట్లో బతుకుతావున్నదని గ్రామంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కంకర పరిశ్రమలో పనిచేస్తున్న కూలీలు చాలామంది మరణించారు మరణించిన వారి కుటుంబాలకు డబ్బులు చెల్లిస్తూ చేతులు దులుపుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి అని వారు తెలిపారు ఒకానొక సందర్భంలో పోలీసులే కంకర పరిశ్రమ నడిపించే యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ పోలీసుల సమక్షంలోనే గ్రామ పెద్దలతో చర్చించి పోయిన ప్రాణాలకు ఖరీదు కడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతూ గుట్టను కొల్లగొట్టేందుకు బాంబు పేలుళ్లు జరపడంతో పెద్ద పెద్ద రాళ్లు పంటపొలాల పై పడి పంటలు నష్టపోతున్నాయని దుమ్ముకు పంటలు పండడం లేదని వారు తెలిపారు బాంబు పేలుళ్లకు కంకర పరిశ్రమకు అతి దగ్గరలో ఉన్న చేదు గట్టు తండాలోని ఇల్లు పగుళ్లు వచ్చాయని వారు తెలిపారు కంకర పరిశ్రమ నుంచి వచ్చే దుమ్ము పంటపొలాలపై పడడంతో ఆఖరికి పశువులు వేయడానికి కూడా గడ్డి కరువైందని వారు ఆక్రోషం వ్యక్త పరుస్తున్నారు కంకర పరిశ్రమ నుండి టిప్పర్లు రాకపోకలు సాగించడంతో బైరంపల్లి గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రు కుర్వగడ్డ పల్లి నుంచి బైరంపల్లి కంచన్పల్లి గ్రామాలకు గత ప్రభుత్వాలు ప్రజల రవాణా సౌకర్యం నిమిత్తం బీటీ రోడ్లు వేసిందని కంకర పరిశ్రమను స్థాపించి నిత్యం అధిక లోడుతో టిప్పర్లతో రాకపోకలు సాగించడంతో బీడీ రోడ్డు గుంతల రోడ్డు గా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంకర పరిశ్రమపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని వారి గోడు ఎక్కడ వినిపించాలో అర్థం కావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని బైరంపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు
Comment List