మహా కుంభమేళా ముగిసింది..2027లోనే మరో కుంభమేళా,ఎక్కడో తెలుసా?

మహా కుంభమేళా ముగిసింది..2027లోనే మరో కుంభమేళా,ఎక్కడో తెలుసా?

లోకల్ గైడ్:
144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా..ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా,సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద అత్యంత విజయవంతంగా ముగిసింది.సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025..మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 26వ తేదీతో ముగిసింది.మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.ఈ సంఖ్య అమెరికా జనాభా 34 కోట్ల కంటే దాదాపుగా రెట్టింపు అని పేర్కొంది.ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలోనే తర్వాత వచ్చే కుంభమేళాపై అందరి దృష్టి పడింది.అయితే తర్వాతి కుంభమేళా ఎక్కడ జరుగుతుంది.ఎన్ని రోజులు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు అందర్లో చర్చకు దారి తీస్తున్నాయి.తర్వాతి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ? ఇక తదుపరి కుంభమేళా 2027లో జరగనుంది.మహారాష్ట్రలోని నాసిక్‌ త్రయంబకేశ్వర్ వద్ద ఈ కుంభమేళాను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.నాసిక్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ కుంభమేళా జరగనుంది. దేశంలోనే రెండో అతి పొడవైన నది అయిన గంగా నది ఇక్కడే జన్మిస్తుంది.ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ శివాలయం ఇక్కడ ఉంటుంది.ఇక అక్కడ జరిగే కుంభమేళాను 2027 జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు