ఆస్తిపన్ను రాయితీ రద్దు?
లోకల్ గైడ్:
ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100 లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఆస్తిపన్ను రూ.1200 లోపు ఉన్న భవనాలకు ఏటా రూ.101లు పన్ను చెల్లిస్తే సరిపోతుందని ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తూ జీవో జారీ చేశారు.
*అప్రకటితంగా ఆస్తిపన్ను పెంపు
*కేసీఆర్ సర్కారు ఇచ్చిన రూ.101 పథకానికి ఎసరు పెట్టిన బల్దియా
*పన్ను సవరణ పేరుతో ఇష్టారీతిలో బిల్లులు జారీ
*నాలుగింతల రేట్ల బిల్లులు వడ్డించి బకాయిలు కూడా కట్టాలంటూ నోటీసులు
*కంగుతింటున్న యాజమానులు
*సీఎం రేవంత్‌రెడ్డికి లేఖల ద్వారా ఫిర్యాదు చేస్తున్న బాధితులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100 లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ఆస్తిపన్ను రూ.1200 లోపు ఉన్న భవనాలకు ఏటా రూ.101లు పన్ను చెల్లిస్తే సరిపోతుందని ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తూ జీవో జారీ చేశారు. ఈ పథకాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. ఇటీవల సదరు యాజమానికి ప్రసాద్‌రావుకు ఎలాంటి సమాచారం లేకుండా సవరించిన ఆస్తిపన్ను నోటీసు అందింది. రూ.101 నుంచి ఏటా రూ.10,608ల చొప్పున ట్యాక్స్ వేసి నాలుగేళ్ల ట్యాక్స్ ఒకేసారి రూ. 43,267లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. దీంతో కంగు తినడం ప్రసాద్ రావు వంతైంది.ట్యాక్స్‌ను అకస్మాత్తుగా ఎందుకు సవరించాల్సి వచ్చింది? రూ.101 స్కీం ఎత్తివేస్తూ జీవో ఏమైనా జారీ చేశారా? ఒకవేళ సవరిస్తే గతంలో మాదిరిగా రూ.1100లు కట్టాలి.. కానీ ఎందుకు ఏటా రూ. 10,608 లు కట్టాలి? వంటి ప్రశ్నలు వేసుకుంటున్నాడు. తన ఇంటి చుట్టు పక్కల ఎవరికీ రూ.1400 నుంచి రూ.2800లకు మించలేదు.. ఇదెక్కడి అన్యాయమని డిప్యూటీ కమిషనర్లను, టీఐ (ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ల)ను అడిగినా ఫలితం లేదు. ఇదేక్కడి సవరణ, ఆస్తిపన్నుల జారీలో ఇష్టారాజ్యంగా అధికారుల వ్యవహారం ఉందంటూ సదరు ప్రసాదరావు సమగ్ర వివరాలతో సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇక్కడ ఒక్క ప్రసాదరావుకే కాదు.. గ్రేటర్‌లో చాలా మంది రూ.101 స్కీం లబ్ధిదారులపై జీహెచ్‌ఎంసీ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నది. ఇటీవల జీహెచ్‌ఎంసీ ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఆస్తిపన్ను పరిష్కార వేదికలో ఈ తరహా ఫిర్యాదులు వస్తుండడం అధికారుల పనితీరుకు నిదర్శనం.
Comment List