ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన సీ పీ, కలెక్టర్ 

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన సీ పీ, కలెక్టర్ 

 లోకల్ గైడ్ :

మంచిర్యాల్ జిల్లా.లక్షేట్టిపేట,పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ శ్రీనివాస్ లు పరిశీలించారు. పోలింగ్ కేంద్రం లో ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాల గురించి వాకబు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.అంతకుముందు రామగుండం సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీ ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలులో ఉన్నట్టు తెలిపారు. కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ సీ పీ లు, సీఐ లు, ఎస్సై లు సిబ్బంది మొత్తం 560 మందితో పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రత చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ పోలింగ్ కేంద్రాలలో పలుమార్లు తనిఖీ చేసి ఓటర్ల కు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వయోభారంతో బాధడుతున్న వారిని, దివ్యాంగులు కూడా ఓటు వేసే విధంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ సహకరించారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగడంలో ఎస్సై పీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు