ఆస్కార్ వేడుకకు... ఇక నాలుగు రోజులే
లోకల్ గైడ్ :
అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కేంద్రంగా సాగే అకాడమీ అవార్డుల వేడుక తీరే వేరు. సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించని వారు సైతం ఆస్కార్ అవార్డుల వేడుకను కళ్ళింతలు చేసుకొని చూస్తారంటే అతిశయోక్తి కాదు.సినిమా అభిమానులను అలరిస్తూ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి ఎన్ని అవార్డులు ప్రకటిస్తున్నా, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కేంద్రంగా సాగే అకాడమీ అవార్డుల వేడుక తీరే వేరు. సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించని వారు సైతం ఆస్కార్ అవార్డుల వేడుకను కళ్ళింతలు చేసుకొని చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకర్షించే 97వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ కాలమానం ప్రకారం ఈ సంవత్సరం మార్చి 3వ తేదీ ఉదయం 5 గంటల నుండి జరగనుంది. వాస్తవానికి అమెరికాలో మార్చి 2వ తేదీ ఆదివారం సాయంకాలం నుండే సందడి సాగనుంది.ఆ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల దాకా ఈ వేడుక జరుగుతుంది.లాస్ ఏంజెలిస్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 97వ ఆస్కార్ అవార్డుల వేడుక సాగనుంది.
Comment List