హనుమాన్ దర్శకునితో రెబల్ స్టార్ సినిమా పిక్స్ ...!
లోకల్ గైడ్:
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా.. అలాగే ఇండియన్ ఫస్ట్ సూపర్ వుమెన్ ప్రాజెక్ట్ మహాకాళి అనే ప్రాజెక్ట్‌లను చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుండగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ సనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం.
Comment List