శివుడి గురించి ఆలోచిస్తే ఆయన రూపమే గుర్తుకు వస్తుంది: మంచు విష్ణు
లోకల్ గైడ్:
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'.ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా..శివుడి పాత్రను బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ పోషించాడు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై జనాల్లో ఆసక్తిని కలిగించింది.'శివా శివా శంకరా'పాట బాగా వైరల్ అయింది. విష్ణు కెరీర్ కు కీలకమైన సినిమా కావడంతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అక్షయ్ కుమార్‌పై విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'కన్నప్ప'మూవీ హిందీ ఈవెంట్ కు మంచు విష్ణుతో పాటుగా అక్షయ్ కుమార్, సీనియర్ నటి మధుబాల హాజరయ్యారు.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ''అక్షయ్ కుమార్ తో ఇంతకముందు నాకు పర్సనల్ రిలేషన్ షిప్ లేదు.కానీ ఇలాంటి గొప్ప మనిషిని కలిసినందుకు నేను గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నా.ఒక యాక్టర్ గా నేను ఆయన ముందు చాలా చిన్నవాడిని.సెట్స్ లో నేను ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.ఇండియాలోని సూపర్ స్టార్స్ లో ఆయనొకరు.క్రమశిక్షణ,సినిమా పట్ల ఉన్న అంకితభావమే అక్షయ్ ను సూపర్ స్టార్ ని చేశాయని అనుకుంటున్నాను''అని అన్నారు.
Comment List