ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి: సీఎం స్టాలిన్

ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి: సీఎం స్టాలిన్

లోకల్ గైడ్:
హిందీ భాష‌ను ఎట్టి ప‌రిస్థితిలో త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. త‌మిళ భాష‌ను,త‌మిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తాన‌న్నారు. హిందీ-సంస్కృతం ఆధిప‌త్యం వ‌ల్ల‌..ఉత్త‌రాదికి చెందిన 25 ప్రాచీన భాష‌లు నాశ‌న‌మైన‌ట్లు ఆరోపించారు.చెన్నై:హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు త‌న పోరాటాన్ని ఉదృతం చేసింది.ఆ భాష‌ను ఎట్టి ప‌రిస్థితిలో అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు.త‌మిళ భాష‌ను, త‌మిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తాన‌న్నారు.హిందీ భాష‌ను క‌చ్చితంగా నేర్చుకోవాల‌న్న నిబంధ‌న‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని,హిందీ భాష ఓ మాస్క్ అయితే,సంస్కృతం ఓ క‌నిపించ‌ని ముఖం అన్నారు.పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు రాసిన లేఖ‌లో ఆయ‌న ఈ విష‌యాన్న తెలిపారు.మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్ర స‌ర్కారు కొత్త‌గా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ తెచ్చిన విష‌యం తెలిసిందే.అయితే కేంద్ర నిర్ణ‌యాన్ని డీఎంకే వ్య‌తిరేకిస్తున్న‌ది.బీహార్‌,యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాట్లాడే మిథిలీ,బ్ర‌జ్‌భాషా,బుందేల్‌ఖండ్‌,అవ‌ధి లాంటి స్థానిక భాష‌లు..హిందీ భాష ఆధిప‌త్యం వ‌ల్ల నాశ‌న‌మైన‌ట్లు స్టాలిన్ త‌న లేఖ‌లో తెలిపారు.హిందీ-సంస్కృత భాషల ఆధిప‌త్యం వ‌ల్ల ఉత్త‌రాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాష‌లు అంత‌రించిపోయిన‌ట్లు స్టాలిన్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.శ‌తాబ్ధ కాలం నాటి ద్ర‌విడ ఉద్య‌మం వ‌ల్ల‌..త‌మిళ భాష,సంస్కృతిని ర‌క్షించుకున‌ట్లు చెప్పారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు