వికారాబాద్ జిల్లాలోని సి సి రోడ్లపై నిఘా
వివిధ గ్రామాలలో శంకుస్థాపనలు
తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
లోకల్ వికారాబాద్ జిల్లా :-
తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మర్పల్లి మండలంలో 3.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.కల్కోడ గ్రామంలో కేసారం నుండి తొర్మామిడి వరకు 1.62 కోట్ల రూపాయల వ్యయంతో అదేవిధంగా రావులపల్లి గ్రామంలో కేసారం నుండి తొర్మామిడి వరకు 1.87 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ అండ్ బి రోడ్డు పునరుద్ధరణ పనులకు స్పీకర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం రావులపల్లి గ్రామంలో శ్రీ పార్వతీ సమేత పీతాంబరేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా, కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని, గుడి చుట్టూ ప్రదక్షిణలు గావించి పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇఇ శ్రవన్ ప్రకాష్, డిఇ శ్రీధర్ రెడ్డి, పంచాయత్ రాజ్ డీఇ జితేందర్, తహసిల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో రాజ మల్లయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comment List