SLBC టన్నెల్ ప్రమాదం.. 

జీరో పాయింట్ వద్దకు రెస్క్యూ టీం...

SLBC టన్నెల్ ప్రమాదం.. 

లోకల్ గైడ్:
SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది బాధితుల ఆచూకీ ఇంకా లభించలేదు.ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా..వారి జాడ దొరకలేదు.లోపల చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా ? లేదా ?అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది.సంఘటనా స్థలం వద్ద సైన్యం,నేవీ,   ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి ,బీఆర్‌వో,ఎన్‌జీఆర్‌ఐ,జీఎస్‌ఐ,ఎల్‌అండ్‌టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి.11 రెస్క్యూ టీమ్‌లు,57 మంది రెస్క్యూ సభ్యులు నిరంతరం పనిచేస్తున్నారు.తాజాగా సహాయచర్యల్లో కాస్త పురోగతి కనిపించినట్లు తెలిసింది. కాసేపటి క్రితం రెస్యూ బృందం సభ్యులు టన్నెల్ జీరో పాయింట్ వద్దకు చేరుకున్నారు.అక్కడి నుంచి కేకలు వేస్తూ,గట్టిగా శబ్దాలు చేస్తూ లోపల చిక్కుకున్న కార్మికులను పిలిచినా..ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ బయటికొచ్చాయి.గల్లంతైన కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు,యంత్ర పరికారలను తొలగించే ప్రక్రియలో కార్మికులు నిమగ్నమయ్యారు.సొరంగం కూలిన సమయంలో అక్కడ పని చేస్తున్న వారు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని తెలిసింది.ఈ క్రమంలో శిథిలాలు వారిపై పడి ఉంటాయన్న అనుమానంతో తొలగింపు చర్యలు చేపట్టారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు