మంచిగా వర్షాలు కురిసి రైతులకు బాగా పంటలు పండాలి

శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్

మంచిగా వర్షాలు కురిసి రైతులకు బాగా పంటలు పండాలి

శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరైన శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్

లోకల్ గైడ్, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం, తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలోని  శ్రీ మల్లప్ప గుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంలో
బుధవారం జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారుకల్వకుర్తి, నాగర్ కర్నూల్  శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీమతి కౌసల్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులుఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్  మాట్లాడుతూ,అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇది చాలా పవిత్రమైన రోజు. ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లప్ప గుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టం. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి, శివపార్వతుల కళ్యాణాన్ని కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించిన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి  ధన్యవాదాలు.మీ అందరి ఆశీర్వదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పరిపాలనలో ఉన్నది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడంతో పాటుగా ప్రజలకు  ఇచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను అమలు చేసే శక్తి, సామర్ధ్యాలను ఆ భగవంతుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి ఇవ్వాలని భగవంతుని కోరుకున్నాను.రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, ఈ ఏడాది మంచిగా వర్షాలు కురిసి రైతులకు బాగా పంటలు పండాలని ప్రార్ధించాను.శ్రీ మల్లప్ప గుట్ట పవిత్రమైనది, ఇక్కడ మంచి వాతావరణం ఉన్నది. మల్లప్ప గుట్టను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లప్ప గుట్ట అభివృద్ధికి వారితో కలిసి ప్రభుత్వం నుండి ఎక్కువ నిధుల మంజూరుకు కృషి చేస్తానని స్పీకర్ అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు