పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
కొణిజర్ల/ ఏన్కూరు,లోకల్ గైడ్:
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మంగళవారం వైరా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ లతో కలిసి కొణిజర్లలో మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు సూరంపల్లి రామారావు, ఏన్కూరులో కాంగ్రెస్ మండల అధ్యక్షులు స్వర్ణ రామారావు నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కొణిజర్లలో కొనకంచి మోషే తల్లి రోజమ్మ ఇటీవల మృతి చెందగా.. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో గుత్తా వెంకటేశ్వరరావు తండ్రి మరణించగా.. వారి కుటుంబ సభ్యులను ఎంపీ రఘురాంరెడ్డి పరామర్శించి.. అండగా ఉంటామని అభయమిచ్చారు.ఈ కార్యక్రమంలో..: రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీను,, నాయకులు స్వర్ణ ప్రహ్లాద రావు, ముక్తి వెంకటేశ్వరరావు, నల్లమల శివకుమార్, కట్ల సత్యనారాయణ, మేకా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
Comment List