మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగిన మంత్రి దామోదర రాజనర్సింహ

మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగిన మంత్రి దామోదర రాజనర్సింహ

లోకల్ గైడ్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు.మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెలేలు కాలె యాదయ్య, వేముల వీరేశం, మాజి మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, చంద్రశేఖర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన మంత్రి దామోదర. ఎస్సీ కులాలో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయి. హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.ఈ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులు అర్పించుకున్నాం. జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారు. ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిది.హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయ రంగు పూయకూడదు.మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలి. వర్గీకరణ విషయంలో అదే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపలే వర్గీకరణకు అనుకూలంగా గౌరవ సీఎం గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాదిగల పట్ల అది ఆయన నివద్ధత, పేదల హక్కుల పట్ల చిత్తశుద్ధి.సుప్రీంకోర్టు తీర్పునకు అనుకూలంగా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేలా అన్ని విధాల అధ్యయనం చేసిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో వంకలు పెట్టడానికేం లేదు. వర్గీకరణపై అబద్ధాలు, మోసం, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దు.త్వరలో వర్గీకరణ చట్టం చేస్తాం. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతాం.రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త చరిత్ర రాయబోతున్నాం.మీకు ఎక్కడ అవసరమున్నా,ఏ ఆపదున్నా ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు