జ‌న‌సంద్రంగా మారిన మ‌హాకుంభ‌మేళా.....

లోక‌ల్ గైడ్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సంక్రాతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలి రానున్నారు. సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇక సోమవారం ఉదయం 8 గంటల వరకు సుమారు 40 మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో షాహీ స్నాన్‌ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పౌరులు కూడా పుణ్య స్నానాలు చేస్తున్నారు. సాధువులు లక్షలాదిగా తరలివస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News