ఇరువైపుల స్థంభించిన ట్రాఫిక్‌

గన్నీ బ్యాగుల కోసం జాతీయ రహదారిపై ఆందోళన

ఇరువైపుల స్థంభించిన ట్రాఫిక్‌

లోకల్ గైడ్:

గన్నీ బ్యాగుల కోసం జాతీయ రహదారిపై రాస్తారోకో.. ఇరువైపుల స్థంభించిన ట్రాఫిక్‌ Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్‌ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.మక్తల్ : పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ( Gunny bags ) ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్‌ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై చేరుకుని రాస్తారోకోను ( Rastaroko ) చేపట్టారు. రైతులు గన్నీ బ్యాగుల కోసం సోమవారం ఉదయం మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రాగా, కార్యాలయ సిబ్బంది రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారు.దీంతో అధికారుల తీరుకు విసుగు చెందిన రైతన్నలు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ యాసంగి సీజన్లో పంట చేతికొచ్చి ధాన్యం మొత్తం కల్లాలపై ఉన్నప్పటికీ రైతులకు అందించాల్సిన గన్నీ బ్యాగులను అందించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అధికారుల మొండి వైఖరి వల్ల ఆదివారం కురిసిన వర్షానికి భారీ మొత్తంలో ధాన్యం తడిసి పోయిందని వాపోయారు.అధికారులు రైతులకు తేదీల వారిగా టోకెన్ల ను జారీ చేసి సంచులు ఇవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి, అవసరమైన పెద్ద రైతులకు రహస్యంగా గన్నీ బ్యాగులను తరలిస్తున్నారని ఆరోపించారు. రైతన్నల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న మక్తల్ సీఐ రామ్‌లాల్ హుటాహుటినా సిబ్బందితో ధర్నా వద్దకు వెళ్లి రైతులను సమదాయించారు.రైతులు ఏమాత్రం తగ్గకుండా, గన్నీ బ్యాగులు వచ్చేంతవరకు రోడ్డుపై ఉంటామని కూర్చోవడంతో, సీఐ జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు కావలసిన గన్నీ బ్యాగులను అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మండలంలో రైతులకు నాలుగున్నర లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, కేవలం కార్యాలయంలో 25 వేల గన్నీ బ్యాగులు మాత్రమే ఉన్నాయని, ఈ గన్నీ బ్యాగులను ఎవరికి ఇవ్వాలో అర్థం కాక కార్యాలయంలోనే నిలువ ఉంచామని పీఏసీసీఎస్‌ మక్తల్ కార్యాలయం సిబ్బంది రాములు తెలిపారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News