కతాల్ గూడ లో బడి బాట--------- ర్యాలీ..

కతాల్ గూడ లో బడి బాట--------- ర్యాలీ..

నల్లగొండ, లోకల్ గైడ్ తెలంగాణ

నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల చేత నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్  దండెంపల్లి సరోజ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు  కతాల్ గూడ  ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులు వార్డు పెద్దలు కలిసి అర్బన్ కాలనీలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ విశాలమైన ఆట స్థలం, ఆకర్షణీయమైన తరగతి గదులు, ప్రతి తరగతి గదిలో ఫ్యాను,డ్యూయల్ డెస్క్ లు, పచ్చని చెట్లు కలిగిన  ఆహ్లాదకరమైన వాతావరణం , ఇంగ్లీష్ మీడియం స్కూల్ కతాల్ గూడెం లో ఉండడం అభినందనీయమని అన్నారు. నవోదయ, గురుకుల ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంద ని,వారానికి మూడుసార్లు రాగి జావా, మూడు కోడిగుడ్లతో పౌష్టికాహారం మధ్యాహ్నం భోజన సదుపాయం, యూనిఫామ్ ,పుస్తకాలు నోట్ బూక్ లు  ప్రభుత్వ పాఠశాలలో అందజేయడం జరుగుతుందని అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత నిత్యం అందించే ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మన చెంత నుండగా వేలకు వేల ఫీజులు కట్టి ప్రవేటు పాఠశాలకు పంపవలసిన అవసరం లేదని అన్నారు.
   ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, మాజీ కౌన్సిలర్లు  దండంపల్లి సత్తయ్య ,కంకణాల నాగిరెడ్డి ,పజ్జురి పరమేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఎస్ కె రఫీ, ఉపాధ్యాయులు చంద్ బీ , రాజశేఖర్ , భవాని,మధు  అంగన్వాడి టీచర్ రమాదేవి, ఆర్ పి  మమత,తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.