ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే 

జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ

ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే 

లోకల్ గైడ్ :

ప్రతి మనిషిని గౌరవించాలని, ప్రతి మనిషీ తాను ఆత్మ గౌరవంతో జీవించాలని ప్రభోదిస్తూ ఆ హక్కుల పరిరక్షణ కోసం, వాటిని అడ్డగించే దుష్టులపై జీవిత కాలం యుద్ధం చేసిన మహాత్ముడు జ్యోతి రావు ఫూలే అని, వారు చూపిన మార్గంలో ఈ సమాజం పయనించి లోక కల్యాణానికి పాటు పడాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా కేఎస్ఆర్ గౌడ వారికి ఘన నివాళి అర్పించారు. మహనీయుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా సభలు,  సమావేశాలు నిర్వహించడం, పూల మాలలు అలంకరించడం, విగ్రహాలు ఏర్పాటు చేయడం, వారి గొప్పతనాన్ని కీర్తించడంతో పాటు తమ జీవితంలో వారి పోరాట స్ఫూర్తిని ఆచరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తే వ్యవస్థలో పరివర్తన చాలా వేగంగా జరుగుతుందని ఆయన అభిలషించారు. వ్యక్తిగత పద్దతి వ్యక్తికి, కుటుంబ ఆచారాలను కుటుంబానికి, సమూహ విధానాలు సమూహానికి పరిమితం చేస్తూ తనను తాను గౌరవించుకుంటూ, ఇతరులను ప్రేమించడమే  ఆధునిక మానవుడు మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి అని జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .