బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికే  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు.

లోకల్ గైడ్ తెలంగాణ :

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  134వ జయంతి సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జై భీమ్ నినాదాలు చేస్తూ దళిత సంఘ నాయకులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ విశ్రాంతి ఐపిఎస్ అధికారి నాగరాజు పాదయాత్ర నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మండలంలోని  ఇల్లంద గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్  రాజ్యాంగం, ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. దళితులందరూ మద్యం మాంసాలకు దూరంగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్షను తీసుకొని మంచి మార్గంలో నడుస్తూ ఆయన చేసిన సేవలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్  పేరిట రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్  స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని  ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి  నిమ్మని శేఖర్ రావు,మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, పిఏసిఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా, కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజీ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న, మాజీ జెడ్పిటిసి కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఎస్.సి సెల్ జిల్లా అధ్యక్షుడు తుల్లా రవి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భానుప్రసాద్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జోగుల సంపత్, దళిత సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .