బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?
ట్రంప్ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన చైనా..!
లోకల్ గైడ్:
Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. Tariff War | చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50శాతం సుంకాలు విధిస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చైనాపై ప్రతీకార సుంకాలు విధించడం ఏకపక్షమని, రెచ్చగొట్టే చర్యలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతీకార సుంకాలపై తాము సైతం ప్రతీకారంగా సుంకాలను విధించామని.. భవిష్యత్‌లో మరిన్ని సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా ఈ చర్యలు తీసుకుందని తెలిపింది. సాధారణ అంతర్జాతీయ వాణిజ్య క్రమాన్ని కొనసాగించేందుకు ఉద్దేశించిన పూర్తిగా చట్టబద్ధమైన చర్య అని.. చైనాపై సుంకాలు పెంచుతామని అమెరికా బెదిరించడం తప్పు అని పేర్కొంది. ఇది మరోసారి అమెరికా బ్లాక్ మెయిలింగ్ వైఖరిని బహిర్గతం చేసిందని.. దీన్నీ చైనా ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. యూఎస్ అదే మార్గంలో వెళ్తే.. చైనా చివరి వరకు పోరాడుతుందని చెప్పింది.
Comment List