ట్యాంకర్ సహాయంతో ప్రజలకు నీటి సరఫరా.
- ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ప్రజల వద్దకే నీటి ట్యాంకర్.
- మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ట్యాంకర్ సాయంతో నీరు సరఫరా చేస్తున్నాం.
- పెద్దేముల్ పంచాయతీ కార్యదర్శి లాలయ్య వెల్లడి.
లోకల్ గైడ్/తాండూర్:
ఆదివారం మిషన్ భగీరథ నీటికి అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రజలకు ఎలాంటి నీటి కష్టాలు తలెత్తకుండా ఉండేందుకు, ముందస్తుగా ట్యాంకర్ సహాయంతో మంచినీటిని సరఫరా చేశామని పంచాయతీ కార్యదర్శి లాలయ్య తెలిపారు.మిషన్ భగీరథ నీళ్లకు సంబంధించి పైపుల లీకేజ్ కారణంగా చిన్నపాటి మరమ్మతులతో ఆదివారం మిషన్ భగీరథ నీల్లు తాత్కాలికంగా రాలేవని అన్నారు. దీంతో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి ఉండొద్దు అనే ఉద్దేశంతో, నీటి ట్యాంకర్ సహాయంతో.. ప్రజల వద్దకు నీరు సరఫరా చేశామని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామంలో ఏ వాడలో అయినా నీళ్లు రాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న గ్రామ ప్రజలకు నీళ్లు అందించేందుకు ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటామని ఆయన పేర్కొన్నారు.
Comment List