ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం చేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యింది. అయితే ఈ మ్యాచ్లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. మరి ముఖ్యంగా ఓపినర్లు విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో ఆడిన విజయ శంకర అతను జిడ్డు బ్యాటింగ్తో  చెన్నై జట్టు ఓడిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. కేవలం విజయ శంకర్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ 25 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. విజయ శంకర్ మరియు మహేంద్రసింగ్ ధోని ఇద్దరు కూడా మంచి బ్యాట్స్మెన్ లని మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళిద్దరే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణమయ్యారు. మరి ముఖ్యంగా విజయ శంకర్ ఆటను చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. విజయ శంకర్ గ్రీస్ లో ఉంటే ప్రత్యర్థి జట్టు కచ్చితంగా గెలుస్తుంది అనే నమ్మకం  ఇప్పుడు ఐపీఎల్ లో ఉన్న ప్రతి టీంకు అర్థమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 180 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేదించడంలో వరుసగా ఆరు సంవత్సరాల నుంచి విఫలమవుతూ వస్తుంది. నిన్న కూడా ప్రతి ఒక్కరూ  ఈసారి లక్ష్యాన్ని చేదిస్తారు అని అనుకున్నా కూడా మరోసారి చెన్నై జట్టు చేదించలేకపోయింది. దీంతో ఈసారి చెన్నై జట్టు ప్లే ఆప్స్ కాదు కదా కనీసం నాలుగు మ్యాచ్లలో నైనా నెగ్గుతుందా?.. అనే సందేశం నెలకొంది. images (27)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News