విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

చదువుల్లో విద్యార్థులు రాణించాలి

విద్యే జీవితానికి రక్ష -రవీందర్ యాదవ్

మియాపూర్ స్కూల్ లో స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ఫ్యాడ్, పెన్నులు అందజేత

చదువుకు కుల, మత, పేద, ధనిక తేడాలు లేవు

ఇష్టపడి చదివితే గ్యమ్యస్థానం, ఉన్నత పదవులు సులువు

భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడి

లోకల్ గైడ్, శేరిలింగంపల్లి:
బంగారు భవిష్యత్ ను నిర్ణయించేది చదువేనని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాల్లో నిలువాలని విద్యార్థులకు సూచించారు. గురువారం మియాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ఫ్యాడ్ లు, పెన్నులను బహుమతికి అందజేశారు. పరీక్షల సమయం కావడంతో ఎవరూ ఆందోళన చెందకుండా, నిబద్ధతతో చదవితే మంచి మార్కులను సాధించడం సులువు అని స్టూడెంట్స్ కు సూచించారు. చదువుకు కుల, మతాలతో సంబంధం లేదని, ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు ఉపయోగపడేది కేవలం చదువేనని వెల్లడించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ కి మంచి పేరును తీసుకురావాలన్నారు. చదువును బట్టి సమాజంలో గౌరవాలు దక్కుతాయన్నారు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా దానికి చదువు ఒక్కటే మార్గమన్నారు. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు, చదివిన స్కూల్ కు మంచి పేరును తీసుకువచ్చేలా, భవిష్యత్ కి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని రవీందర్ యాదవ్ విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు క్రమపద్ధతిలో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
లోకల్ గైడ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై  చింతలపాలెం పోలీస్ స్టేషన్ నందు   బిజెపి చింతలపాలెం మండల...
తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి
పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ 
పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి 'భూ భారతి' చట్టం దోహదం 
INTSO లో విజయం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్