తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి

గౌడ మహిళలను గుడి నుండి గెంటివేసి, ఈత చెట్లను తగలబెట్టిన వీడీసీ సభ్యులను కఠినంగా శిక్షించాలి.

తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి

నిజామాబాద్ జిల్లాలో చట్ట విరుద్ధంగా ఏర్పాటైన  వి డి సి లను తక్షణమే నిషేధించాలి.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం దగ్గర నిరసన

లోకల్ గైడ్: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ట మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గత ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వీడీసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, గౌడ మహిళలను శ్రీరామనవమి సందర్భంగా  గుడి నుండి గెంటివేసి, గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత చెట్లను కాల్చివేసిన దుర్మార్గులను తక్షణమే అరెస్టు చేయాలని, వి డి సి లను నిషేధించాలని  చేతి వృత్తిదారుల  సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సరోజ లు డిమాండ్ చేశారు.శుక్రవారం సుభాష్ విగ్రహం దగ్గర ప్రజాసంఘాలు వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లాలో విడిసి ఆగడాలను అరికట్టాలని గౌరవ మహిళల సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలని తాటిత చెట్లు నరికిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీడీసీల ముసుగులో రాజ్యాంగేతరశక్తులుగా వ్యవహరించడమే కాకుండా దళితులు బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేస్తున్నారని అన్నారు.  రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లాంటి ఉన్నత అధికారులు వీడీసీల అరాచకాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని అన్నారు. కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై  వీడీసీలు తమ ఆధిపత్యాన్ని అంగీకరించి అణిగిమనిగి ఉండాలని హుకుం జారీ చేస్తున్నారని అన్నారు.  తాము చెప్పినట్టు వినని వారిపై సాంఘిక బహిష్కరణకు గురి చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం ఈ సాంఘిక బహిష్కరణ జరిగి గీత కార్మికులు నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు?  ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం గౌడ మహిళలు గుడికి వెళితే అవమానించి గుడి నుంచి గెంటి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడు వినిపించుకుందామని వారు వెళితే సుమారు 150 ఈత చెట్లను తగలబెట్టారని వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాల్ని ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెక్ పెట్టాలని వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.. జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు తక్షణమే ఆ గ్రామాన్ని సందర్శించి సాంఘిక బహిష్కరణ ఎత్తివేసి వీడీసీలను సమూలంగా నిషేధించాలని గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని  సంఘాలు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం భిక్షం, కెవిపిఎస్ పట్టణ అధ్యక్షులు కోట సైదులు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల నరేష్, కత్తుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వంగూరి వాచకం -నవరత్నాలు  వంగూరి వాచకం -నవరత్నాలు 
లోకల్ గైడ్: 1. దూసుకుపోయేవారుఆకాశంలో పక్షిలా ఎగిరిపోతారుఊగిసలాడేవారు ఊయలలా ఉన్నచోటే ఆగిపోతారు  2.అధినేత తలుచుకుంటే అందలాలకు కరువు లేదు అనతి కాలంలోనే కర్ణుడు అంగరాజై మెరవలేదా  3....
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి 
భూ భారతి చట్టం నిజంగా రైతులకు చుట్టం
స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాల ఆవిష్కరణ. 
R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి
సూర్యాకే డీసీసీ కిరీటమా?
దళారులను నమ్మి మోసపోవద్దు