వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....

 వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....

లోక‌ల్ గైడ్ :
ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో పాటు సినిమాలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయ‌న ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. దీంతో సినిమాలు త్వ‌ర‌గ‌తిన పూర్తి చేయ‌డం ఇబ్బందిగా మారింది. ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తుంది. ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సిన ఈ చిత్రం తాజాగా మ‌రోసారి వాయిదా ప‌డింది.’హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తొలుత ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్న‌ట్టు చెప్పారు. ఇప్పుడు మే 9వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు హోలీతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశారు.కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో పవన్‌, నిధి అగర్వాల్‌ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్‌ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కల్యాణ్‌ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డివోల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తుండగా, దానికి ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి