ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి
ములుగు,లోకల్ గైడ్ తెలంగాణ:
కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోడౌన్ లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నామని తెలిపారు. ఈవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవిఎం గదులను, అక్కడ భద్రత ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ భాస్కర్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Comment List