పెద్దేముల్ డిప్యూటీ తహసీల్దారుగా శ్రీనివాసులు.
లోకల్ గైడ్/ పెద్దేముల్:
పెద్దేముల్ మండల డిప్యూటీ తహసిల్దార్ గా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు చేపట్టారు.ఇదివరకు పరిగి మండలంలో ఎలక్షన్ ఢీటి గా విధులు నిర్వహించిన శ్రీనివాసులు, పెద్దేముల్ మండల డీటీగా నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీనివాసులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇదిలా ఉంటే గతంలో పెద్దేముల్ మండల డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వర్తించిన మహేష్, సాధారణ బదిలీల్లో భాగంగా బంటారం మండలానికి బదిలీపై వెళ్లారు. సుమారు 6 నెలల నుండి ఖాళీగా ఉన్న డిటి పోస్టును ఎట్టకేలకు ప్రభుత్వం శ్రీనివాసులను నియమిస్తూ కాళీ పోస్టును భర్తీ చేశారు. ఈ సందర్భంగా డిటి మాట్లాడుతూ... మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ భూ సమస్యలతో సతమతమవుతున్న ప్రతి పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్దేముల్ మండల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. మండల ప్రజలు అందరూ నాకు సహకరించి నా సేవలను విస్తృతంగా వాడుకోవాలని స్పష్టం చేశారు.
Comment List