మెల్లమాంభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
లోకల్ గైడ్, మిర్యాలగూడ :
ప్రముఖ రచయిత్రి "శ్రీశ్రీ కుమ్మరి మొల్లమాంబ" 560వ జయంతి సందర్భంగా పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ కుమ్మర మెల్లమాంభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని, విగ్రహ ఆవిష్కరణ చేసి, పూల మాలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొట్ట మొదటి మహిళా రచయిత్రి మొల్లమాంబ అని, ఆమె రచించిన మొల్ల రామాయణం ఆరోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెంది, ఆమె మంచి కీర్తి గడించిందని, మొల్ల తన జీవితాంతం రచించిన కవితలు తెలుగు మాట్లాడే చోట, దేశవ్యాప్తంగా పాడబడతాయని, వారి సరళత మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక ఉత్సాహం గత ఐదు వందల సంవత్సరాలుగా వాటిని ప్రజాదరణ పొందేలా చేశాయని, వారి సేవలను కొనియాడారు. వారి జీవన విధానం ఎంతో మందికి ఆదర్శం అని, వారి కీర్తిని రానున్న తరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుమ్మరి సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List