ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఈదునూరి వెంకటేశ్వర్లు మాదిగ.

ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

 లోకల్ గైడ్ తెలంగాణ,నెక్కొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నోటిఫికేషన్లను ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇదినూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం నెక్కొండ తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది.  ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేపట్టాలని, మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి  చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిర్రు కమలహాసన్ మాదిగ, మండల సలహాదారులు కందిక వీరస్వామి మాదిగ, విద్యార్థి సంఘ నాయకులు ఇదినూరి సురేష్ మాదిగ, స్వామి రామచందర్, డెక్క అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి