రేవంత్‌ రెడ్డీ.. కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు :

బీఆర్‌ఎస్ Assembly Media point

రేవంత్‌ రెడ్డీ.. కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు :

లోకల్ గైడ్:

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్‌ గురించి రేవంత్‌ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశాడని, ఆయనను మార్చురీకి పంపిస్తానని అహంకారంతో మాట్లాడాడని బీఆర్‌ఎస్‌ విమర్శించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాణిక్ రావు, అనిల్ జాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు.బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్‌ గురించి రేవంత్‌ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశాడని, ఆయనను మార్చురీకి పంపిస్తానని అహంకారంతో మాట్లాడాడని బీఆర్‌ఎస్‌ విమర్శించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాణిక్ రావు, అనిల్ జాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. తాను 2009 నుంచి అసెంబ్లీలో ఉన్నానని, వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు లాంటి సీఎంలను చూశానని, కానీ రేవంత్‌ రెడ్డి లాంటి చేతగాని సీఎంను ఎప్పుడూ చూడలేదని అన్నారు.కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కేవలం మాజీ ముఖ్యమంత్రిగా చూస్తున్నడని, కానీ తాము తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నామని గంగుల అన్నారు. కేసీఆర్ చావాలని కోరుకుంటావా..? అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి తనకు తాను తెలంగాణ సీఎంనే అని అనుకుంటే.. పితృ సమానులైన కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తండ్రి లాంటి కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరని, తెలంగాణ సమాజానికి కూడా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి