సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.

సైబర్ జాకృత్క దివాస్ సందర్భంగా నల్గొండ మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమం.

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.

సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ.


 లోకల్ గైడ్ ,తెలంగాణ:

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశానుసారం, నల్గొండ సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో, నల్గొండ డి.ఎస్.పి కే శివరాం రెడ్డి సూచన మేరకు, నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  నల్గొండ వన్ టౌన్ పరిధిలోని నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సైబర్ జాకృత్క దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ, సైబర్ నేరాలు పలు రకాలుగా ఉంటాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ మన నుండి డబ్బులను కాజేస్తారని వివరించారు. అట్టి వాటిని నమ్మకూడదని, ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలని, తదుపరి సమీప పోలీస్ స్టేషన్ ని సంప్రదించమని తెలియజేశారు.నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వాటిపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, మనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోకూడదని, ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప, మరొక విధంగా వాడకూడదని, ముఖ్యంగా విద్యార్థినిలు వారి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తులను ఫేస్బుక్లో గాని, ఇంస్టాగ్రామ్ లో గాని, మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో స్నేహితులుగా యాక్సెప్ట్ చేయకూడదని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లను అటెండ్ చేయకూడదని, అదేవిధంగా విద్యార్థులు బెట్టింగ్ యాప్ లకి దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు మొదట డబ్బు ఆశ చూపి, తదుపరి మన ఫోన్లో ఉన్న డేటాను తస్కరించి, తద్వారా మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను కొట్టేస్తారని వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ, సైబర్ క్రైమ్ డిఎస్పి లక్ష్మీనారాయణ , వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  ,ఎస్సై సైదులు , సైబర్ క్రైమ్ సిబ్బంది రియాజ్, మోక్షిత్, ఫారుక్ మరియు మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి