మంత్రి వర్గ విస్తరణ లో మాదిగలకు 2 పదవులు కేటాయించాలి .
ఈ నెల 4 నుండి 10 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో డప్పు బృందాలతో ప్రదర్శన లు చేపట్టాలి .
లోకల్ గైడ్ , నల్లగొండ జిల్లా బ్యూరో:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ శ్రాస్తీయ బద్దంగా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో మాదిగల జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన 11శాతం అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈ నెల 4 నుండి 10వరకు మండల, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో డప్పు బృందాలతో వివిధ రూపాలతో ప్రదర్శనలు చేయాలి అని పిలుపునిస్తూ మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులను కేటాయించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణను అశాస్త్రీయంగా చేసి మాదిగలను మోసం చేయాలని చూస్తున్న కొంత మంది వర్గీకరణ వ్యతిరేక శక్తులకు గుణపాఠం చెప్పడానికి ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ప్రదర్శనకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు కావున అన్ని మండల, గ్రామాల నుంచి మాదిగ మరియు మాదిగ ఉప కులాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి అని పిలుపు నివ్వడం జరిగింది. ఎంఎస్పీ జిల్లా నాయకులు గోసంగి పరమేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, ఎమ్మార్పియస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి సందేల శ్రీనివాస్ మాదిగ, జిల్లా నాయకులు భూడిద జానీ మాదిగ, జిల్లా నాయకులు దుబ్బ దానయ్య మాదిగ, సీనియర్ నాయకులు గట్టు శ్రీనివాస్ మాదిగ, బొట్ల దేవదాస్ మాదిగ, భూడిద సురేందర్ మాదిగ, ఆడేపు శ్రీనివాస్ మాదిగ, గట్టు రాములు మాదిగ, పందుల భిక్షపతిమాదిగ, కోళ్ల జహంగీర్ మాదిగ, ఆకారపు లక్ష్మీనారాయణ మాదిగ, గోపి నాగరాజు మాదిగ, వద్దిగళ్ల రాజు మాదిగ, గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ లతో పాటు ఎమ్మార్పిఎస్, ఎంఎస్పీ వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List