విద్యార్థుల పొదుపే, రేపు వారికి బంగారు భవిష్యత్తు..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్
లోకల్ గైడ్,శాయంపేట:
విద్యార్థులకు ఈ రోజుల్లో పొదుపు చాలా అవసరమని, పొదుపే రేపు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని శాయంపేట ఎస్బిఐ రాజేష్ అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాయంపేట ఎస్బిఐ మేనేజర్ రాజేష్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఈ ఆర్థిక క్రమశిక్షణ రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు, ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను తీసుకొని పొదుపు చేయాలని, ఇప్పుడు చేస్తున్న ఈ పొదుపే రేపు బంగారు భవిష్యత్తు అవసరాల కోసం చాలా ఉపయోగపడుతుందని ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని ఉండదని అన్నారు, ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటి నుండి తస్మాత్ జాగ్రత్త అని విద్యార్థులకు తెలియజేశారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపించిన లింక్స్ గాని ఓటీపీలు గాని ఎవరికి షేర్ చేయవద్దని అన్నారు, ఒకవేళ తెలియక సైబర్ నేరాల వలలో పడినట్లయితే వెంటనే గుర్తించి బ్యాంకును గాని పోలీసులను గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. తద్వారా మీకు సహాయం చేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు హాస్టల్లో సైన్స్ వేర్ నిర్వహణని తిలకించారు. విద్యార్థుల యొక్క ప్రతిభను చూసి విద్యార్థులను అభినందించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలా అదృష్టవంతులని ఈ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలియజేశారు. నేను కూడా గురుకుల పాఠశాలలోనే చదివి బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నానని గుర్తు చేశారు. ఈ పాఠశాలలో చదువుకున్నందుకు చాలా గర్వ పడుతున్నానని, మీరందరూ కూడా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజిని, ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, విడ్స్ స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్స్ మారపెల్లి క్రాంతికుమార్, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు
Comment List