ఏ పనికైనా ఏఐ ఏజెంట్ సిద్ధం!
లోకల్ గైడ్ :
మానవుడి నిత్య జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) భాగం కాబోతున్నది.తదుపరి తరం ఏఐని అందుబాటులోకి తెచ్చేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొందరు ఇప్పటికే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏఐ హెల్పర్లను అందుబాటులోకి తెస్తున్నారు.అయితే మనుషుల పర్యవేక్షణ తప్పనిసరి.కీలక నిర్ణయాల్లో అప్రమత్తత తప్పదు.ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి కంపెనీల పోటీ.న్యూఢిల్లీ:మానవుడి నిత్య జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ)భాగం కాబోతున్నది.తదుపరి తరం ఏఐని అందుబాటులోకి తెచ్చేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొందరు ఇప్పటికే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏఐ హెల్పర్లను అందుబాటులోకి తెస్తున్నారు. చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ కంపెనీ గత నెలలో ఆపరేటర్ అనే ఏఐ ఏజెంట్‌ను పరిచయం చేసింది. ఇది వెబ్‌ను ఉపయోగించుకుని ఫారాలను నింపడం,వంట వండటానికి అవసరమైన సరుకులను ఆర్డర్ ఇవ్వడం వంటి పనులు చేస్తుందని ఆ కంపెనీ తెలిపింది.
Comment List