ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు
ప్రభుత్వ నిర్ణయంతో ఏర్పాటు
సాయిపూర్లో ప్రారంభించిన ఏఎంఓ రామ్ మస్త
లోకల్ గైడ్/ తాండూర్: జిల్లాలోని తాండూరు పట్టణంలోని పాఠశాలలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. సోమవారం పట్టణంలోని సాయిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ఏఎంఓ రామ్ మస్త ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాలలో ఏఐ ల్యాబ్ ప్రారంభించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో భాషతో పాటు గణిత శాస్త్రంలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్ ద్వారా నేర్చుకోవడం వల్ల లోపాలను సరిచేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఏఐ విద్యను అందించడంలో సలహాలు, సూచనలు అందించారు. మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, కాంప్లెక్స్ హెచ్ఎంలు మాట్లాడుతూ ఏఐ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ ద్వారా సామర్థ్యాలు మెరుగు పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ వెంకటమ్మ, హెచ్ఎం నర్సింహా రెడ్డి, ఉపాధ్యాయులు హరీష్ కుమార్, ప్రభులింగం గౌడ్, విద్యారాణి, సంధ్యారాణి, రాములు, ఐఈఆర్పీ గంగ, విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List