భద్రాద్రి కొత్తగూడెం మాలమహానాడు జిల్లా అధ్యక్షులుగా పూల రవీందర్
రెండోసారి ఏకగ్రీవంగా పూల రవీందర్ ఎన్నిక
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి(లోకల్ గైడ్ ):మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎర్రమల రాములు సూచనల మేరకు అల్లాడి.పాల్ రాజు నాయకత్వంలో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద గల సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ నందు మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలు 22 మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.జిల్లాలో ఉధృతంగా మాల మహానాడు బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి,ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎనలేని పోరాటం చేస్తున్నటువంటి, మాలల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పూల రవీందర్ ను ఏకధాటిగా ఏకగ్రీవంగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి.పాల్ రాజ్ ప్రతిపాదించగా సీనియర్ మాల మహానాడు నాయకులు కొప్పరి. నవతన్ బలపరచగా, ఐదు నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు మద్దతు తెలుపగా జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఆమోదించగా ఏకగ్రీవంగా రెండవసారి జిల్లా అధ్యక్షులుగా పూల రవీందర్ ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పగిడిపల్లి శ్రీకాంత్, పుష్పలత, గంధం కల్పన,వాసు మల్ల గౌతం, ఇల్లంగి.తిరుపతి, ప్రభాకర్, పిఎన్ మూర్తి,మాధవి లత, శేషమ్మ,స్వర్ణలత పిల్లి. రవి వర్మ,పుట్టి. శ్రీనివాస్, వినోద్, రమేష్ బాబు, సతీష్, సుధాకర్,స్రవంత్,భాగ్యరాజు, చల్ల.పుల్లయ్య, ప్రేమ్,దేవా, పండుగ.రాజేంద్రప్రసాద్, జాలా. ఓదెలు, సోమరాజు, రాజేశ్వరరావు,కొరిమి. సురేష్, బద్దం. రాహుల్, సుధీర్ కుమార్, అజయ్,పిల్లి.వెంకటేశ్వర్లు, లాలయ్య,శ్రీకాంత్,అప్పారావు, కార్తీక్, నరసింహారావు, ఏసుబాబు, మనమ్మ, రాణి, వెంకట నరసమ్మ, ఆమని,రాజా, ప్రతాప్, కమలాకర్, పనితి. వెంకటేశ్వర్లు తదితర మాల మహానాడు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.
Comment List